సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సాయి పల్లవి పాట మరో రికార్డు
- పవన్ కోసం పోలీస్ స్టేషన్ సెట్స్
- 120 కోట్ల బడ్జెట్టుతో శేఖర్ కమ్ముల
* పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ చిత్రానికి సంబంధించిన తదుపరి షూటింగు త్వరలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం పోలీస్ స్టేషన్ సెట్స్ ను వేస్తున్నారు. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన 30 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
* దర్శకుడు శేఖర్ కమ్ముల తొలిసారిగా భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ధనుష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో శేఖర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. దీనిని 120 కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.