'బంగార్రాజు'లో రమ్యకృష్ణ ప్లేస్ కి ఢోకా లేదట!
- యాక్షన్ మూవీ సెట్స్ పై నాగ్
- లైన్లోకి వచ్చేసిన 'బంగార్రాజు'
- మరో యంగ్ హీరోయిన్ కి ఛాన్స్
- త్వరలో మిగతా వివరాలు
'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో సీనియర్ నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాలోనూ నాగార్జున సరసన ఆమెనే కనిపించనుందనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా 'జయప్రద' పేరు తెరపైకి వచ్చింది. దాంతో ఈ సినిమాలో రమ్యకృష్ణ కనిపించదేమోననే సందేహం అందరిలో మొదలైంది. అయితే రమ్యకృష్ణ ప్లేస్ కి ఎలాంటి ఢోకా లేదట. ఆమె కాకుండానే జయప్రదను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో అఖిల్ జోడీగా ఓ యంగ్ హీరోయిన్ ను కూడా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.