ఈ సారి కూడా దూకుడు మీదే ఉన్న రవితేజ!
- ముగింపు దశలో 'ఖిలాడి'
- ఈ నెలాఖారులో పాట చిత్రీకరణ
- త్వరలోనే థియేటర్లకు
రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ 'ఖిలాడి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. క్రితం నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు గానీ కరోనా వలన కుదరలేదు. చివరి షెడ్యూల్లో భాగంగా ఒక పాటను .. ఒక యాక్షన్ సీన్ ను ఈ నెల చివరి వారంలో చిత్రీకరించనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. షూటింగు తరువాత మిగతా కార్యక్రమాలను చకచకా పూర్తిచేసి థియేటర్స్ లో దింపేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.