'ఠాగూర్' సీక్వెల్ పై స్పందించిన వినాయక్!
- 'ఠాగూర్' సినిమా ఒక అద్భుతం
- సీక్వెల్ ఆలోచన సాహసమే
- సీక్వెల్ కథ అంతకుమించి ఉండాలి
'ఠాగూర్' సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆశ ... ఆసక్తి నాకూ ఉన్నాయి. కానీ అద్భుతమనేది ఎప్పుడైనా ఒక్కసారే జరుగుతుంది. నా దృష్టిలో అలాంటి అద్భుతమే 'ఠాగూర్' సినిమా. అన్నివర్గాల ప్రేక్షకులను అంతగా ప్రభావితం చేసిన ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనుకోవడం పెద్ద సాహసమే అవుతుంది. సీక్వెల్ ఎప్పుడూ కూడా ముందుగా వచ్చిన సినిమాకి మించి ఉండాలి. అలా ఉందనే నమ్మకం దర్శకుడికి కలగాలి .. అదే అభిప్రాయం జనం నుంచి రావాలి. లేదంటే ముందుగా తెచ్చిన పేరు చెడగొట్టినట్టు అవుతుంది. అందువలన 'ఠాగూర్' సీక్వెల్ ఆలోచన చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు.