చెక్కపెట్టెలో పసికందు... గంగా నదిలో కొట్టుకొచ్చిన వైనం!
- నాడు గంగానదిలో కర్ణుడు దొరికిన ఘటన
- అదే రీతిలో కొట్టుకొచ్చిన పెట్టె
- పాపతో పాటు పెట్టెలో జాతకచక్రం
- పాప పేరు గంగ అని గుర్తించిన పోలీసులు
జాలరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ పసికందును ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. మూడు వారాల వయసున్న ఆ శిశువు ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. ఇప్పుడా చిన్నారి తల్లిదండ్రులు ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొన్ని తాంత్రిక క్రియల్లో భాగంగానే ఇలా చేశారా? అన్న కోణంలోనూ పోలీసులు పరిశోధిస్తున్నారు.