ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీలో రాశి ఖన్నా!
- తెలుగులో రెండు సినిమాలు
- తమిళంలో అరడజను సినిమాలతో బిజీ
- హిందీ వెబ్ సిరీస్ పై ఆశలు
- నాగ్ అశ్విన్ మూవీలో ఛాన్స్
ప్రస్తుతం ప్రభాస్ .. 'సలార్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన 'ఆది పురుష్' ప్రాజెక్టు పైకి రానున్నాడు. ఆ వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ .. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మితం కానుంది. కీలకమైన పాత్రల కోసం వివిధ భాషల నుంచి నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఆల్రెడీ అమితాబ్ .. దీపికా పదుకొణే పేర్లు ఖాయమైపోయాయి. ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రాశి ఖన్నాను తీసుకున్నారనేది తాజాగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.