ఓ అభిమాని సాహసం పట్ల చలించిపోయిన సోనూ సూద్... ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దని విజ్ఞప్తి
- సోనూసూద్ పట్ల అభిమానం పెంచుకున్న వెంకటేశ్
- వికారాబాద్ నుంచి పాదయాత్ర
- 700 కిమీ ప్రయాణించి ముంబయి చేరిక
- ముగ్ధుడైన సోనూ సూద్
కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెంకటేశ్ అంతదూరం నడిచి రావడం పట్ల ఆయన చలించిపోయారు. మార్గమధ్యంలో ముంబయి వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేసినా అతడు నడిచే వచ్చాడని, అతని అభిమానం తనను నిజంగా ముగ్ధుడ్ని చేసిందని వెల్లడించారు. అయితే, దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దని, కష్టాలను కొని తెచ్చుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.