సంక్రాంతి బరిలోకి పవన్ రీమేక్ మూవీ!
- సెట్స్ పై ప్రస్తుతం రెండు సినిమాలు
- కరోనా కారణంగా ఆగిన షూటింగు
- త్వరలో మొదలుపెట్టే ఆలోచన
- విడుదల మరింత ఆలస్యం
అయితే కరోనా కారణంగా ముందుగా అనుకున్నట్టుగా షూటింగు జరగలేదు. షూటింగు పరంగా జరిగిన ఆలస్యం ఈ సినిమా విడుదలపై పడనుంది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా షూటింగు మొదట్లోనే ఉంది. 'హరిహర వీరమల్లు' భారీ బడ్జెట్ తో కూడినది కావడం వలన సమయం ఎక్కువ తీసుకుంటుంది. అందువలన ఈ రెండు సినిమాల విడుదల పరిస్థితిపై అభిమానులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ చేస్తున్న రీమేక్ ను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని అంటున్నారు. ఇక 'హరి హర వీరమల్లు'ను మాత్రం వేసవి సెలవుల్లో రిలీజ్ చేయవచ్చని చెబుతున్నారు.