శ్రుతిహాసన్ లా ఉండటం కష్టమన్న తమన్నా!
- శ్రుతి హాసన్ కి ధైర్యం ఎక్కువ
- ఎప్పుడు చూసినా యాక్టివ్ గా ఉంటుంది
- సమస్యలను లైట్ తీసుకుంటుంది
- బాధ కలిగితే తనకి కాల్ చేస్తాను
తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ .. " శ్రుతిహాసన్ తో నేను ఎక్కువ చనువుగా ఉంటాను. మేము తరచూ కలుసుకుంటూ ఉంటాము .. ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము. శ్రుతి హాసన్ చాలా ధైర్యంగా ఉంటుంది .. ఎప్పుడు చూసినా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఒక వైపున ఇంటిపనులు .. మరో వైపున షూటింగులు చక్కబెడుతూనే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎలాంటి సమస్యలైనా లైట్ తీసుకుని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా తనలా ఉండగలగడం చాలా కష్టం. నా మనసుకు ఎప్పుడైనా బాధ కలిగితే తనకే కాల్ చేస్తాను" అని చెప్పుకొచ్చింది.