బోయపాటినే సెట్ చేయనున్న అల్లు అర్జున్!
- 'పుష్ప' షూటింగులో అల్లు అర్జున్
- రెండు భాగాలుగా రానున్న 'పుష్ప'
- బోయపాటి కథ విన్న అల్లు అర్జున్
- తదుపరి సినిమా ఆయనతోనే
'పుష్ప' సినిమా తరువాత కొరటాల దర్శకత్వంలో సినిమా చేయాలని అల్లు అర్జున్ అనుకున్నాడు. కానీ 'పుష్ప'ను రెండు భాగాలుగా తీయాలనుకోవడంతో, కొరటాల తన కథలో ఎన్టీఆర్ ను సెట్ చేసుకున్నాడు. దాంతో 'పుష్ప' పూర్తికాగానే తనకి బోయపాటి అందుబాటులో ఉంటాడని భావించిన అల్లు అర్జున్ .. ఆయననే సెట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఆల్రెడీ కథా చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. 'పుష్ప' రెండు భాగాలు పూర్తయ్యేలోగా బోయపాటి మిగతా పనులన్నీ పూర్తిచేసుకుని సిద్ధంగా ఉంటాడన్న మాట.