అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వానంద్?
- సెట్స్ పై 'మహాసముద్రం'
- కరోనా కారణంగా ఆగిన షూటింగ్
- శర్వాకి కథ వినిపించిన అనిల్ రావిపూడి
- త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్
ఇప్పుడు శర్వానంద్ తాజా చిత్రంగా 'మహాసముద్రం' రూపొందుతోంది. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలోను ఆయన ఒక సినిమాను చేయనున్నాడనే టాక్ తాజాగా వినిపిస్తోంది. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగిపోయినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 'ఎఫ్ 3' పనుల్లో ఉన్న అనిల్ రావిపూడి, బాలకృష్ణతో కూడా ఒక సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. మరి ఈ రెండు ప్రాజెక్టులలో ముందుగా అనిల్ రావిపూడి ఏ సినిమాను పట్టాలెక్కిస్తాడో చూడాలి.