వినీత్ దృష్టి ఇక తెలుగు సినిమాలపైనే!
- వినీత్ మంచి క్లాసికల్ డాన్సర్
- 'ప్రేమదేశం'తో విపరీతమైన క్రేజ్
- 'రుక్మిణి' .. 'ఆరోప్రాణం' వంటి హిట్లు
- ఇంతకాలానికి రీ ఎంట్రీ
హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా వినీత్ ముఖ్యమైన పాత్రలను చేస్తూనే ఉన్నాడు. ఇటీవల తెలుగులో వచ్చిన 'రంగ్ దే' సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇచ్చాడు. చాలా కాలం తరువాత తెరపై వినీత్ ను చూసిన అభిమానులు, ఆయనలో పెద్దగా మార్పురాలేదని అనుకున్నారు. ఇక వినీత్ అందుబాటులోకి రావడంతో, ముఖ్యమైన పాత్రల కోసం ఆయనను దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారట. ఈ నేపథ్యంలో తెలుగు భాషపై కాస్త పట్టు సాధించి, ఇక్కడ వరుస సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడని అంటున్నారు. రీ ఎంట్రీ ఆయనకి ఏ స్థాయిలో కలిసొస్తుందో చూడాలి మరి.