పిసినారి పాత్రలో సందడి చేయనున్న రాజేంద్రప్రసాద్
- జంధ్యాల మార్కు కామెడీ
- అప్పట్లో నవ్వులు పూయించిన 'అహ నా పెళ్లంట'
- కోట తరహా పాత్రలో రాజేంద్ర ప్రసాద్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమా రూపొందుతోంది. కరోనా కారణంగా వాయిదాపడిన షూటింగు త్వరలో మొదలుకానుంది. 'ఎఫ్ 2'లో 'భార్యలను ప్రేమగా చూసుకోవాలోయ్' అంటూ రెండో భార్యతో దొరికిపోయే పాత్రలో నవ్వించిన రాజేంద్ర ప్రసాద్, 'ఎఫ్ 3' సినిమాలో పరమ పిసినారి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. జంధ్యాల సినిమా 'అహ నా పెళ్లంట'లో ప్రతి విషయానికి 'అయితే నాకేంటి?' అంటూ పిసినారి పాత్రలో కోట చేయిజాపుతూ ఉంటాడు. అదే తరహా పాత్రలో రాజేంద్రప్రసాద్ సందడి చేయనున్నాడని చెబుతున్నారు.