తెలంగాణలో సాయంత్రం ఐదు గంటల వరకు కరోనా ఆంక్షల సడలింపు?
- కేసీఆర్ అధ్యక్షతన రేపు మంత్రిమండలి సమావేశం
- జనం ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట వెసులుబాటు
- రాత్రిపూట పకడ్బందీగా కర్ఫ్యూ అమలు
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 9తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలను మరింతగా సడలించడంతోపాటు రాత్రిపూట మాత్రం కర్ప్యూను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.