సమస్యల పరిష్కారం కోరుతూ.. 14, 15వ తేదీల్లో ఏపీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
- కరోనా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలి
- కరోనా బారినపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలి
- బొత్సకు సమ్మె నోటీసు ఇచ్చిన పారిశుద్ధ్య కార్మిక సంఘం నేతలు
పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని, కరోనా బారినపడిన కార్మికులకు మెరుగైన వైద్యం, హెల్త్ అలవెన్సు, జీతాల బకాయిలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నట్టు తెలిపారు. ఇందులో ప్రజారోగ్య విభాగంతోపాటు ఇంజనీరింగ్ కార్మికులు, పాఠశాలల్లో స్వీపర్లు కూడా పాల్గొంటారని తెలిపారు.