లాక్ డౌన్ సమయంలో న్యాయవాదులను అడ్డుకోవద్దు: టీఎస్ హైకోర్టు
- బార్ కౌన్సిల్ కార్డును చూపించే లాయర్లను అనుమతించాలి
- వారి స్టెనోలు, క్లర్కులను కూడా అడ్డుకోవద్దు
- తమ ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్రంగా పరిగణిస్తాం
గుర్తింపు కార్డులను చూపించినా అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. తమ సూచనల మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీని ఆదేశించింది. ఇదే సమయంలో న్యాయవాదులు, క్లర్కులు, స్టెనోలకు కూడా సూచనలు జారీ చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది.