'వీరమల్లు'పై మరింత ఆసక్తిని పెంచుతున్న టాక్!
- మొఘల్ కాలంలో నడిచే కథ
- భారీ సెట్ల కోసం కోట్ల ఖర్చు
- డిఫరెంట్ లుక్స్ తో పవన్ కల్యాణ్
- కథానాయికగా నిధి అగర్వాల్
ఈ సినిమాలో 'వీరమల్లు' అనే వజ్రాల దొంగ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. దీంతో ఆయన లుక్ డిఫరెంట్ గా ఉండనుంది. అయితే కథాపరంగా ఆయన మరో రెండు డిఫరెంట్ లుక్స్ లో కూడా కనిపించనున్నాడనే టాక్ కొత్తగా వినిపిస్తోంది. తనని అన్వేషిస్తున్న సైనికుల నుంచి తప్పించుకోవడం కోసం ఆయన గెటప్స్ మారుస్తాడా? లేదంటే అలాంటి సందర్భం మరేదైనా ఉందా? అనేది ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిధి అగర్వాల్ కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాలో,బాలీవుడ్ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.