విజయ్ దేవరకొండ నిర్మాతగా మరో ప్రాజెక్టు రెడీ!
- హీరోగా విపరీతమైన క్రేజ్
- నిర్మాతగా కూడా ప్రయోగాలు
- కొత్త దర్శకులకు అవకాశాలు
తన బ్యానర్ పై 'మీకు మాత్రమే చెప్తా' సినిమాను నిర్మించిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం తన తమ్ముడు హీరోగా 'పుష్పక విమానం' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే మరో సినిమాను నిర్మించడానికి విజయ్ దేవరకొండ ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. పృథ్వీసేన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో అంతా నూతన నటీనటులే కనిపిస్తారట. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.