మరో రికార్డును సెట్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్'
- మాస్ మసాలా మూవీగా 'ఇస్మార్ట్ శంకర్'
- మణిశర్మ సంగీతం హైలైట్
- అందాలు ఆరబోసిన హీరోయిన్లు
- 200 మిలియన్ల వ్యూస్ ను రాబట్టిన సినిమా
అలాంటి 'ఇస్మార్ట్ శంకర్' హిందీ డబ్ వెర్షన్ కూడా అనేక రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా 200 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టేసి మరో రికార్డును నమోదు చేసింది. రామ్ ఇంతవరకూ చేసిన సినిమాల్లో వ్యూస్ పరంగా 200 మిలియన్ల మార్కును అందుకున్న సినిమాలు మూడు ఉన్నాయి. తాజాగా ఆ సినిమాల సరసన 'ఇస్మార్ట్ శంకర్' కూడా చేరింది. దాంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం రామ్ .. లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.