కథ కోసమే కష్టాలు పడుతున్న వంశీ పైడిపల్లి!
- నేను కథలు రెడీ చేసుకోలేను
- రచయితలపై ఆధారపడవలసిందే
- అందుకే ఆలస్యం అంటున్న వంశీ పైడిపల్లి
తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు వంశీ పైడిపల్లి సమాధానమిస్తూ .. "నేను కథలు రాసుకోలేను .. కథల కోసం రచయితలపై ఆధారపడవలసి వస్తోంది" అన్నారు. కథలో మార్పులు చేయించవలసి వచ్చినప్పుడు, రచయితలను పట్టుకుని ఆ పనిని పూర్తి చేయించవలసి ఉంటుంది. అందువలన మరింత ఆలస్యమవుతోంది. ఇకపై అలా జరగకుండా ముందుగానే కథలను రెడీ చేసిపెట్టుకుంటాను" అంటూ వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు. విజయ్ హీరోగా .. దిల్ రాజు బ్యానర్లో ఆయన ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.