సన్నీ లియోన్ ఇంటి పక్కన డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేసిన అమితాబ్!
- రూ. 31 కోట్లతో కొనుగోలు చేసిన అమితాబ్
- ఇంటి విస్తీర్ణం 5,184 చదరపు అడుగులు
- ఇదే భవనంలో ఇంటిని కొన్న సన్నీ లియోన్
ఈ డూప్లెక్స్ హౌస్ లను ప్రముఖ బిల్డర్ సంస్థ క్రిస్టల్ గ్రూప్ నిర్మించింది. బహుళ అంతస్తుల ఈ భవనంలో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్లలో ఉంది. ఇదే బిల్డింగ్ లో బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ కూడా ఇంటిని కొనుగోలు చేసింది.
మరోవైపు, అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 13 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు ఇమ్రాన్ హష్మి, రణబీర్ కపూర్, అలియా భట్ లతో కలిసి నటించిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.