సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- వెబ్ సీరీస్ సక్సెస్ గురించి తమన్నా
- జులై నుంచి తిరిగి 'ఆచార్య' షూటింగ్
- 'పుష్ప'కు పెరుగుతున్న నటులు
* చిరంజీవి, కొరటాల కలయికలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రానికి సంబంధించి మరికొంత షూటింగ్ మిగిలివుంది. ఈ షూటింగును జులై నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. జులై నుంచి షూటింగులో జాయిన్ కావడానికి చిరంజీవి కూడా ఓకే చెప్పారట.
* అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం రెండు భాగాలుగా వస్తుండడంతో కేస్టింగ్ కూడా పెరుగుతోంది. రెండో భాగంలో రెండో హీరోయిన్ పాత్ర ఉంటుందని, ఓ ప్రముఖ నటి ఆ పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. అలాగే పార్టీ 2లో మరికొందరు బాలీవుడ్ తారలు కూడా నటిస్తారట.