'బంగార్రాజు'లో చైతూ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్?
- 'నానీస్ గ్యాంగ్ లీడర్'తో ఎంట్రీ
- నిరాశపరిచిన 'శ్రీకారం'
- తమిళంలో వరుస అవకాశాలు
- 'బంగార్రాజు' కోసం వినిపిస్తున్న పేరు
నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా రూపొందనుంది. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక చైతూ జోడీగా సమంత పేరు వినిపించింది. కానీ ఈ సినిమాలో సమంత నటించడం లేదట. ఆ పాత్ర కోసం ప్రియాంక అరుళ్ మోహన్ ను సంప్రదిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రియాంక అరుళ్ మోహన్ మూడు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. 'బంగార్రాజు' సినిమా కోసం ఆమెను సంప్రదించడమనేది ఎంతవరకూ వాస్తవమో చూడాలి.