'టక్ జగదీశ్' రిలీజ్ పై నిర్మాతల క్లారిటీ!
- నాని తాజా చిత్రంగా రానున్న 'టక్ జగదీశ్'
- కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా
- ఓటీటీకి ఇచ్చే ఉద్దేశం లేదన్న నిర్మాతలు
- నానికి అన్నయ్యగా జగపతిబాబు
అయినా ఈ ప్రచారం ఆగడం లేదు .. థియేటర్లు తెరిచే వరకూ 'టక్ జగదీశ్' నిర్మాతలు ఓపిక పట్టే పరిస్థితి లేదనీ, అందువలన ఓటీటీలోనే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. దాంతో నిర్మాతలు మళ్లీ రంగంలోకి దిగవలసి వచ్చింది. 'టక్ జగదీశ్' సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశం లేదనీ, థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో నానికి అన్నయ్య పాత్రలో జగపతిబాబు నటించిన సంగతి తెలిసిందే.