రేపే కల్యాణ్ రామ్ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్!
- '118' తరువాత దక్కని హిట్
- సొంత బ్యానర్లో మరో సినిమా
- కొత్త దర్శకుడికి ఛాన్స్
కల్యాణ్ రామ్ కి '118' తరువాత హిట్ పడలేదు. దాంతో ఆయన తన సొంత బ్యానర్ పైనే ఈ సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకోవడంతో, మరో ప్రాజెక్టును కూడా ఆయన పట్టాలెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఆయనకి కూడా ఇది తొలి సినిమానే. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి. కల్యాణ్ రామ్ ఎదురుచూస్తున్న హిట్ ఈ సినిమాలతోనైనా లభిస్తుందేమో చూడాలి.