సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ధూళిపాళ్లను చంద్రబాబు కోరింది నిజం కాదా?: పేర్ని నాని
- అరాచకాలకు పాల్పడుతున్న జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టకూడదా?
- సహకార డెయిరీ వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు
- టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు
సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ధూళిపాళ్ల నరేంద్రను గతంలో చంద్రబాబు కోరింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు అన్నారని చెప్పారు. ఏపీలో సహకార డెయిరీ వ్యవస్థను చంద్రబాబు సర్వనాశనం చేశారని ఆరోపించారు.
లక్ష జీవాలను చంపిన మొసలి ముసలితనంలో నీతులు చెప్పినట్టు చంద్రబాబు తీరు ఉందని విమర్శించారు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు, చంద్రబాబుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి కేసును రఘురాజు కేసు మాదిరే ముగిద్దామని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు సిగ్గులేకుండా చెపుతున్నారని మండిపడ్డారు. టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అన్నారు.