యువకుడి చెంపఛెళ్లుమనిపించిన అదనపు కలెక్టర్.. వీడియో ఇదిగో
- లాక్‌డౌన్ సమయంలో కొందరు కలెక్టర్ల అత్యుత్సాహం
- ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లో యువకుడిని కొట్టిన కలెక్టర్
- ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి
- అదనపు కలెక్టర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి
ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. లాక్‌డౌన్ సమయంలో చెప్పుల షాప్ నిర్వహిస్తున్న ఓ యువకుడిపై షాజాపూర్ అదనపు కలెక్టర్ మంజూషా విక్రంత్‌రాయ్ చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. ఆమె తీరుపై తమకు సమాచారం అందిందని ఆ రాష్ట్ర మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ తెలిపారు. దర్యాప్తు జరిపి అవసరమైతే ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.