సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సమంత మెచ్చిన బాలీవుడ్ హీరో
- 'సలార్'లో మరో ప్రముఖ నటుడు
- 'సారంగ ధరియా' మరో రికార్డు
* ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న 'సలార్' యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం నటించే అవకాశం కనిపిస్తోంది. చిత్రంలోని ఓ కీలకమైన నెగటివ్ పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
* శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' సినిమాలో మంగ్లీ పాడిన 'సారంగ ధరియా' పాట ఎంతగా హిట్టయిందో మనకు తెలుసు. ఈ పాటలో సాయిపల్లవి డ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా, తాజాగా ఈ పాట యూ ట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ కు పైగా సంపాదించి సరికొత్త రికార్డును నెలకొల్పింది.