దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టి జనార్దన్‌రెడ్డిపై కేసులా?: చంద్రబాబు
- జనార్దన్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు
- టీడీపీ నేతల అక్రమ అరెస్టులపైనే జగన్ దృష్టి
- బేషరతుగా విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. వైసీపీ పాలన మూడు అక్రమ కేసులు, ఆరు అరాచకాలుగా సాగుతోందన్నారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను వదిలిపెట్టి జనార్దన్‌రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.