టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు
- జనార్దన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
- డోన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- నేడు ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు
మొదట కాటసాని రామిరెడ్డి అనుచరులు ముగ్గురు జనార్దన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో కనిపించగా, టీడీపీ కార్యకర్తలు వారిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జనార్దన్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గత అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేడు ఆయనను ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరచనున్నారు.