కరోనా మరణాలు, ఆక్సిజన్ గురించే కాదు... రికవరీ రేట్ గురించి కూడా మాట్లాడుకుందాం: రేణూ దేశాయ్
- కరోనా వ్యాప్తిపై రేణూ సందేశం
- వీడియో షేర్ చేసిన ఆరోగ్యాంధ్ర
- ప్రతికూల చర్చలు సరికాదన్న రేణూ దేశాయ్
- సానుకూల అంశాలు కూడా ఉన్నాయని వెల్లడి
తనకు తెలిసిన వాళ్లలో 70 ఏళ్ల వయసున్నవారు కూడా కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారని వివరించారు. డబుల్ మాస్కులు ధరిస్తూ, శానిటైజేషన్, భౌతికదూరం పాటిస్తూ తమను తాము కాపాడుకోవాలని, అప్పటికీ కరోనా పాజిటివ్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని సూచించారు. మనకు ఎంతో మెరుగైన వైద్య వ్యవస్థ ఉందని, డాక్టర్లపై నమ్మకం ఉంచి చికిత్స పొందాలని రేణూ తెలిపారు.
గట్టిగా పోరాడితే కరోనాను జయిస్తారని పిలుపునిచ్చారు. ఈ మేరకు రేణూ దేశాయ్ సందేశంతో కూడిన వీడియోను ఏపీ ప్రభుత్వానికి చెందిన 'ఆరోగ్యాంధ్ర' తన సోషల్ మీడియాలో ఖాతాలో పంచుకుంది.