ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు
- లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం
- చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు
- రామాపురం చెక్‌పోస్టు వద్ద వాహనాల అడ్డగింత
- పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాలు
ఉదయం 10 గంటల వరకు మినహాయింపు ఉన్నప్పటికీ వాహనాలను నిలిపివేశారు. ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి రావడానికి అనుమతి ఉంటుందని చెప్పారు. అలాగే, ఎమర్జెన్సీ వాహనాలకు కూడా గుర్తింపు కార్డులు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
మరోవైపు, కర్నూలు నగర శివారులోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ పాస్ ఉంటేనే పోలీసులు తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపు ఉందని భావించి భారీగా వాహనదారులు తరలి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుల్లూరు వద్ద సరుకు రవాణా వాహనాల రాకపోకలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి.