బీఏ రాజు లేరనే వార్త కలచివేసింది: బాలకృష్ణ
- రాజుతో తనకు మంచి అనుబంధం ఉందన్న బాలయ్య
- ఎంతో బాధను కలిగిస్తోందన్న ప్రకాశ్ రాజ్
- రాజుగారు తనను ఎంతో ప్రోత్సహించారన్న విశాల్
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ... రాజుగారి అకాలమరణం తనను ఎంతో బాధిస్తోందని అన్నారు. సినిమా పట్ల మీరు చూపించే ప్రేమను ఇకపై తామంతా ఎంతో మిస్ అవుతామని చెప్పారు. ప్రతి ఒక్కరి కోసం ఇంతకాలం మీరు నిలిచారని అన్నారు.
హీరో విశాల్ మాట్లాడుతూ... తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి రాజుగారు తనను ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. తనకు అండగా నిలిచిన సోదరుడు, స్నేహితుడైన రాజు మరణవార్తతో తన హృదయం ముక్కలైందని అన్నారు.