మహేశ్ ను మరింత స్టయిలిష్ గా చూపించనున్న త్రివిక్రమ్!
- మహేశ్ తో త్రివిక్రమ్ మూడో మూవీ
- కొత్త లుక్ తో కనిపించనున్న మహేశ్
- కథానాయికగా అలరించనున్న పూజా హెగ్డే
ఇక ఈ సినిమాలో మహేశ్ బాబును త్రివిక్రమ్ చాలా స్టయిలిష్ గా చూపించనున్నాడని అంటున్నారు. మహేశ్ లుక్ కొత్తగా ఉంటుందనీ, ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక త్రివిక్రమ్ తన సినిమాల్లో మాటలకు .. పాటలకు ఎంతో ప్రాధాన్యతని ఇస్తాడనే విషయం తెలిసిందే. త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది.