కర్ణాటకలో మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు
- కర్ణాటకలో కరోనా విజృంభణ
- తొలుత మే 10 నుంచి 24 వరకు లాక్ డౌన్ ప్రకటన
- భారీగా మరణాలు, కొత్త కేసులు
- జూన్ 7 వరకు లాక్ డౌన్ పొడిగించిన సీఎం యడియూరప్ప
జూన్ 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నిత్యావసర వస్తువులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని పోలీసులకు, అధికారులకు స్పష్టం చేశామని, ఆ మేరకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. కర్ణాటకలో మే 10 నుంచి 24వ తేదీ వరకు తొలుత లాక్ డౌన్ ప్రకటించినా, కేసుల ఉద్ధృతితో పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.