'శ్యామ్ సింగ రాయ్'కి సెట్టు తెచ్చిన నష్టం!
- షూటింగు దశలో నాని సినిమా
- ఆరున్నర కోట్లతో భారీ సెట్లు
- వానకు తడిసి పాడైన సెట్టు
- సంగీత దర్శకుడిగా మిక్కీ. జె మేయర్
అయితే కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ సెట్ భారీగానే దెబ్బతిందట. ఇలా జరగడం నిర్మాతకు కొంత నష్టాన్ని కలిగించిందనే అంటున్నారు. సెట్టును ఒకసారి మళ్లీ చెక్ చేసుకుని, తగిన మరమ్మతులు చేసిగానీ షూటింగుకు దిగడానికి లేదట. కరోనా లేకపోతే ఈ పాటికే ఆ సెట్టులో షూటింగు అయిపోయేదనీ, ఈ నష్టం జరగకుండా ఉండేదని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో నాని డిటెక్టివ్ గా నటిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్లుగా సాయిపల్లవి .. కృతి శెట్టి కనిపించనున్నారు. మిక్కీ.జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.