'అఖండ'కి సంక్రాంతి సెంటిమెంట్?
- హిట్ కాంబినేషన్లో 'అఖండ'
- కరోనా కారణంగా ఆగిన షూటింగు
- దసరా రిలీజ్ పై ఒక ఆశ
ఇప్పుడు కూడా ఈ సినిమా కరోనా కారణంగానే వాయిదా పడింది. ఇంకా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించవలసి ఉంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాతగానీ, సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి లేదు. ఆ తరువాత మళ్లీ షూటింగును మొదలుపెట్టాలి .. మిగతా పనులను పూర్తిచేయాలి. అంతా స్పీడ్ గా జరిగితే దసరాకి విడుదల చేయవచ్చని భావిస్తున్నారట. కాస్త అటు ఇటైతే 'సంక్రాంతి' బరిలోకి దింపాలని చూస్తున్నారట. బాలకృష్ణకి సంక్రాంతికి సెంటిమెంట్ ఉంది. అందువలన ఈ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశాలే ఎక్కువనే టాక్ బలంగా వినిపిస్తోంది.