'సలార్' చిత్రంలో జ్యోతిక కీలక పాత్ర?
- ముగింపు దశలో 'రాధే శ్యామ్'
- తొలిదశ షూటింగులో 'సలార్'
- ఆ తరువాత 'ఆది పురుష్'పైనే పూర్తి దృష్టి
ఈ సినిమా కోసం ఇటీవల జ్యోతికను కలిసి, ఆమె పోర్షన్ ను చదివి వినిపించడం జరిగిందని చెబుతున్నారు. సాధారణంగా పాత్ర ఏ మాత్రం నచ్చినా, పాన్ ఇండియా సినిమాను ఎవరూ వదులుకోరు. అందువలన ఈ సినిమాకి జ్యోతిక ఓకే చెప్పడం ఖాయమనే అనుకుంటున్నారు. ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హసన్ నటిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకులను పలకరించనుంది. 'రాధే శ్యామ్' తరువాత ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఆ తరువాత 'ఆదిపురుష్' ప్రాజెక్టుపైనే ప్రభాస్ పూర్తి దృష్టి పెట్టనున్నాడు.