ఈ సారి కూడా స్టార్ హీరోతోనే 'వకీల్ సాబ్' డైరెక్టర్!
- 'వకీల్ సాబ్'తో హిట్
- వేణు శ్రీరామ్ పై ఊహాగానాలు
- క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
- పెద్ద బ్యానర్లతో చర్చలు
అయితే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు .. ఇలాంటి ఊహాగానాలకు తెరదించేశాడు. తన తదుపరి సినిమాకి సంబంధించి తాను ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదని ఆయన చెప్పాడు. దిల్ రాజు బ్యానర్లో మాత్రమే కాకుండా ఇతర బ్యానర్లలో సినిమాలు చేయాడానికి తాను సిద్ధంగానే ఉన్నానని అన్నాడు. అలా వేణు తనతో సినిమాలు చేయాలనుకుంటున్న నిర్మాతలకు ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆయన రెండు పెద్ద బ్యానర్లతో చర్చలు జరుపుతున్నాడట. ఏ బ్యానర్ వారు ఓకే చెప్పినా, సెట్స్ పైకి వెళ్లేది స్టార్ హీరోతోనేనని తెలుస్తోంది.