'ఎఫ్ 3'లో వరుణ్ చేసే సందడి ఎక్కువట!
- భారీ వసూళ్లు తెచ్చిన 'ఎఫ్ 2'
- భార్యలు వలన వచ్చే ఫ్రస్ట్రేషన్
- డబ్బు తెచ్చే ఫ్రస్ట్రేషన్ తో 'ఎఫ్ 3'
- ఆగస్టుకు థియేటర్లకు రానట్టే
ఈ మధ్యనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.. కొంతవరకూ షూటింగు జరుపుకుంది కూడా. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగు ఆగిపోయింది. త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కామెడీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ సారి అంతా కూడా డబ్బువలన వచ్చే ఫ్రస్ట్రేషన్ చుట్టూ కథ తిరగనుంది. నిజానికి ఈ సినిమాను ఈ ఆగస్టులో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్న విధంగా షూటింగు జరగకపోవడం వలన, 'సంక్రాంతి'కి వాయిదాపడే అవకాశాలు ఉన్నాయి.