ఇద్దరు యాక్షన్ హీరోలతో మల్టీస్టారర్!
- యాక్షన్ హీరోగా రాజశేఖర్ కి క్రేజ్
- మాస్ ఆడియన్స్ లో గోపీచంద్ కి మంచి పేరు
- ఇద్దరినీ కలుపుతున్న శ్రీవాస్
- శ్రీవాస్ ఖాతలో 'లక్ష్యం' .. 'లౌక్యం' హిట్లు
కొంతకాలంగా దర్శకుడు శ్రీవాస్ ఒక మల్టీ స్టారర్ కథపై కసరత్తు చేస్తూ వచ్చాడట. ఆ కథకు రాజశేఖర్ - గోపీచంద్ అయితే బాగుంటారనే ఉద్దేశంతో వాళ్లకి వినిపించాడట. కథ నచ్చడంతో ఇద్దరూ ఓకే అనేశారని తెలుస్తోంది. ఓ పారిశ్రామికవేత్త నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని కూడా అంటున్నారు. గతంలో గోపీచంద్ తో శ్రీవాస్ చేసిన 'లక్ష్యం' .. 'లౌక్యం' సినిమాలు హిట్ కొట్టాయి. ప్రస్తుతం రాజశేఖర్ - గోపీచంద్ చేస్తున్న సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.