మహారాష్ట్రలో జూన్ 1 దాకా ఆంక్షల పొడిగింపు
- లాక్ డౌన్ తరహా ఆంక్షలు అమలు
- ఉత్తర్వులు జారీ చేసిన ఆ రాష్ట్ర సీఎస్
- పాల సేకరణ, రవాణాకు మినహాయింపు
పాలు, నిత్యావసరాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్ కు ఎలాంటి ఆంక్షలు ఉండవన్నారు. అయితే, వాటి అమ్మకాలు మాత్రం ఆంక్షలకు సడలింపులున్న సమయాల్లోనే చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్లు, ఏపీఎంసీల్లో కరోనా నిబంధనలను పాటించేలా స్థానిక విపత్తు నిర్వహణ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
కరోనా కట్టడిలో అవసరమైన ఔషధాలు, పరికరాల రవాణాలో భాగంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు స్థానిక రవాణా సదుపాయాలు ఉపయోగించుకోవచ్చని, మోనో, మెట్రోల్లో ప్రయాణాలు చేసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.