సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- త్వరలో సమంత వెబ్ సీరీస్ స్ట్రీమింగ్
- మరో సినిమాకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్
- హిందీ సినిమా కోసం లడఖ్ కు నాగ చైతన్య
* ప్రస్తుతం 'ఎఫ్ 3', 'గని' సినిమాలలో నటిస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో మరో చిత్రాన్ని కమిట్ అవుతున్నాడు. చలో, భీష్మ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వరుణ్ ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.
* అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'లాల్ చంద్ చద్దా' హిందీ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ కోసం చైతు లడఖ్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా దీనిని నిర్మిస్తున్నారు.