నాని డిటెక్టివ్ గా కనిపిస్తాడట!
- విడుదలకి సిద్ధంగా 'టక్ జగదీష్'
- షూటింగు దశలో 'శ్యామ్ సింగ రాయ్'
- ప్రత్యేక ఆకర్షణగా ముగ్గురు కథానాయికలు
- సంగీత దర్శకుడిగా మిక్కీజె.మేయర్
కామెడీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నడిచే ఈ సినిమాలో 'డిటెక్టివ్' పాత్రలో నాని కనిపించనున్నాడని అంటున్నారు. కథలో సాయిపల్లవి ప్రధాన నాయిక అయినప్పటికీ, తెరపై నాని చేసే సందడి కృతి శెట్టితోనే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇక మడోన్నా సెబాష్టియన్ పాత్ర ఏమిటనేది తెలియాల్సి ఉంది. జిషు సేన్ గుప్తా ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ నాని చేసిన 'టక్ జగదీష్' తరువాత ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమాకి మిక్కీ.జె మేయర్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.