హిందీ 'ఛత్రపతి'కి నో చెప్పేసిన సాయిపల్లవి!
- సాయిపల్లవికి మంచి క్రేజ్
- వరుస సినిమాలతో ఫుల్ బిజీ
- 'ఛత్రపతి' రీమేక్ కోసం సంప్రదింపులు
- డేట్లు లేవని చెప్పినట్టుగా టాక్
అలాంటి సాయిపల్లవి ఈ సారి కంటెంట్ గురించి కాకుండా, తాను బిజీగా ఉండటం వలన ఒక ప్రాజెక్టును తిరస్కరించింది .. అది హిందీ ప్రాజెక్టు .. 'ఛత్రపతి' రీమేక్. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి ఓ పట్టాన హీరోయిన్ సెట్ కావడం లేదు. సాయిపల్లవిని కూడా అడిగారట. అయితే వరుస సినిమాల కారణంగా డేట్స్ ఇవ్వలేనని చెప్పినట్టుగా సమాచారం. సాయిపల్లవి చేసిన 'లవ్ స్టోరీ' .. 'విరాట పర్వం' విడుదలకు సిద్ధంగా ఉండగా, 'శ్యామ్ సింగ రాయ్' సెట్స్ పై ఉంది.