లాక్ డౌన్ విధింపుపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఆలస్యంగానైనా లాక్ డౌన్ విధించారు
- కరోనా పేషెంట్ల ప్రయాణాలకు అంతరాయం కలగకుండా చూడాలి
- వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
లాక్ డౌన్ సమయంలో కరోనా టెస్టులు, రోగులకు చికిత్స ఆగకుండా చూడాలని ప్రభుత్వాన్ని సంజయ్ కోరారు. పేషెంట్ల ప్రయాణాలకు ఆటంకం కలగకూడదని చెప్పారు. వ్యాక్సిన్ మాత్రమే కరోనాను కట్టడి చేయగలదని... అందువల్ల లాక్ డౌన్ సమయంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగకుండా వేగంగా కొనసాగేలా చూడాలని సూచించారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను కేంద్రం ఇప్పటికే పంపించిందని... వీటి పంపిణీ కోసం ప్రత్యేక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.