కార్తి 'సర్దార్' కోసం భారీ సెట్లు!
- కార్తి తాజా చిత్రంగా 'సర్దార్'
- జైల్లో ఒక ఖైదీ చుట్టూ తిరిగే కథ
- కథానాయికగా రాశి ఖన్నా
- అంచనాలు పెంచుతున్న దర్శకుడు మిత్రన్
ఈ కథలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు జైల్లోనే జరుగుతాయట. అంటే కథలో కీలకమైన మలుపులు జైలును కేంద్రంగా చేసుకుని నడుస్తాయన్న మాట. అందువలన ప్రత్యేకంగా జైలును .. దానికి అనుసంధానం చేయబడిన సెట్లను వేయిస్తున్నారట. ఇందుకుగాను 2 కోట్ల రూపాయాలకు పైగా ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, సాధ్యమైనంతవరకూ సెట్లలోనే షూటింగును కానిచ్చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తి జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. తన కెరియర్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది.