లాక్ డౌన్ దిశగా తెలంగాణ? నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!
- తెలంగాణలో పెద్ద సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులు
- ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఈ మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
ఈ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన అజెండాలో లాక్ డౌన్ విధించే అంశమే కీలకమని చెపుతున్నారు. సంపూర్ణ లాక్ డౌన్ విధించడంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే, ఈ కర్ఫ్యూ వల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. పాజిటివ్ కేసులు యథావిధిగా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో, లాక్ డౌన్ విధించడమే బెటర్ అనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం. మరి కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.