రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్ విధింపుపై నిర్ణయం!
- రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
- లాక్‌డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు
- సీఎం అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ
- లాక్‌డౌన్‌తో పాటు ఇతర అంశాలపైనా చర్చ
ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్ విధించాలా? వద్దా? అనే అంశాలతో పాటు మరికొన్ని కీలక విషయాలు సైతం చర్చకు రానున్నట్లు సమాచారం. లాక్‌డౌన్ విధించిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలంగాణలో విధిస్తే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.