బాలీవుడ్ సినిమాలో నటించాలని వున్నా, అదే అడ్డంకిగా మారిందంటున్న నాని!
- హిందీ రాకపోవడం ప్రతిబంధకమన్న నాని
- హిందీ వచ్చినా సినిమాలకు అది సరిపోదని వ్యాఖ్య
- కథ నచ్చి, హిందీపై పట్టు సాధించాలనే కోరిక కలగాలని షరతు
- లీనమై నటిస్తేనే నేచురల్ స్టార్‌ని అవుతానన్న నాని
అయినప్పటికీ బాలీవుడ్ సినిమా చేసేందుకు తనకు తానే కొన్ని షరతులు విధించుకున్నాడు. అవేంటంటే.. కథ నచ్చాలి. ఆ కథ కోసం తాను కొత్తగా తయారవ్వాలి. హిందీ భాషలో పట్టు సాధించాలన్న కోరిక బలంగా పాతుకుపోవాలి. అలాగే నాని బాలీవుడ్‌కు కొత్త అనే భావన వీక్షకులకు కలగకూడదు. ఇవన్నీ కలిసొస్తే హిందీ సినిమా చేస్తానని తెలిపాడు. తనకున్న నేచురల్ స్టార్ అనే పేరు సార్థకం కావాలంటే బాలీవుడ్‌లోనూ పాత్రలో లీనమై నటించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా, నాని నటించిన 'టక్ జగదీశ్' విడుదలకు సిద్ధంగా ఉంది.